రెజ్లింగ్‌ పోటీల్లో అవంతి విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

రెజ్లింగ్‌ పోటీల్లో అవంతి విద్యార్థుల ప్రతిభ

Aug 15 2026 1:04 AM | Updated on Aug 15 2026 1:04 AM

మాకవరపాలెం: రాష్ట్రస్థాయి 6వ రెజ్లింగ్‌ పోటీల్లో తామరం అవంతి ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపారు. అనకాపల్లిలోని వి.వి.రమణ రైతుభారతి కల్యాణ మండపంలో జరిగిన రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌ పోటీల్లో పాల్గొన్న ఏడుగురు అవంతి విద్యార్థులు సీనియర్‌ యూత్‌ విభాగంలో 5 బంగారు, 2 వెండి పతకాలు సాధించినట్టు కళాశాల ప్రిన్సిపాల్‌ మోహనరావు శుక్రవారం తెలిపారు. స్టేట్‌ చాంపియన్‌ షిప్‌లో కూడా తృతీయ స్థానం సాధించారన్నారు. వీరితోపాటు ఇటీవల కబడ్డీ, బాక్సింగ్‌, ఖోఖో, యోగా, బాడ్మింటన్‌ పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికై న 32 మంది విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్‌ డైరెక్టర్‌లు, కోచ్‌లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement