అనకాపల్లి: జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ సంపర్క్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌బీ సీఐ ఎస్.బాలసూర్యారావు మాట్లాడుతూ జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి సంబంధించిన కుటుంబ, వ్యక్తిగత సమస్యలు, సెలవులు, పోస్టింగ్‌ల అంశాలపై మొత్తం 10 మంది సిబ్బంది ఫోన్ ద్వారా తమ సమస్యలను తెలియజేసినట్లు తెలిపారు. ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు 9346912011 నంబర్‌కు ఫోన్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీ–2 సీఐ టి.లక్ష్మి, కార్యాలయ సూపరింటెండెంట్ దేవరాజు, తదితరులు పాల్గొన్నారు.


