కె.కోటపాడు: శ్రావణమాసం మొదటి శుక్రవారం పురస్కరించుకుని స్థానిక వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి 102 కిలోల పసుపు కొమ్ములతో అర్చన చేశారు. మహిళలతో కుంకుమార్చన నిర్వహించారు.
మునగపాకలో
సాక్షుల విచారణ
మునగపాక: మండల కేంద్రం మునగపాకలో జరిగిన కొట్లాట కేసులో సాక్షులను పరవాడ డీఎస్పీ మోహనరావు శుక్రవారం విచారించారు. గ్రామంలో పర్యటించి, గొడవ జరిగిన సమయంలో బైపాస్ రోడ్డులో ఉన్న కొంతమంది నుంచి, మధ్యవర్తిత్వం చేసిన వ్యక్తి నుంచి వివరాలు సేకరించారు. ఆయన వెంట ఎస్‌ఐ ప్రసాదరావు ఉన్నారు.


