కుసుర్లపూడిలో 100 మీటర్ల జెండాతో విద్యార్థులు, ఉపాధ్యాయులు
కె.కోటపాడు/రోలుగుంట/మునగపాక/బుచ్చెయ్యపేట: 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కె.కోటపాడు మండలం ఏ కోడూరు హైస్కూలు విద్యార్థులు 150 మీటర్ల జాతీయ జెండాతో, రోలుగుంట మండలం కుసుర్లపూడి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు 100 మీటర్ల జాతీయ జెండాతో మునగపాకలో బీజేపీ నాయకులు, విద్యార్థులు 200 మీటర్ల జెండాను ప్రదర్శించారు. బుచ్చెయ్యపేట మండలం వడ్డాదిలో 200 మీటర్ల హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు.


