సత్సంగంతో ఆధ్యాత్మిక చైతన్యం | - | Sakshi
Sakshi News home page

సత్సంగంతో ఆధ్యాత్మిక చైతన్యం

Aug 15 2026 1:04 AM | Updated on Aug 15 2026 1:04 AM

తుమ్మపాల: సత్సంగం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం పెరగడంతో పాటు, మన ధర్మం, సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన, బాధ్యతలు పెరుగుతాయని వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ డి.డి.నాయుడు అన్నారు. తుమ్మపాలలోని వేణుగోపాల స్వామి దేవస్థానంలో శుక్రవారం విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో సత్సంగ వర్గ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వీహెచ్‌పీ ఆవిర్భావ లక్ష్యాలు, హిందూ ధర్మ పరిరక్షణలో సంస్థ చేస్తున్న సేవలు, హిందూ సమాజ సంఘటన అవసరం గురించి వివరించారు. కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడంలో సత్సంగాల పాత్ర ఎంతో ముఖ్యమని తెలిపారు. విశ్వహిందూ పరిషత్‌ జిల్లా కార్యదర్శి పీలా హేమ జగదీష్‌ నాయుడు, జిల్లా కోశాధికారి గోకవరపు రమేష్‌, నగర అధ్యక్షుడు నుదురుపాటి తాతాజీ, సత్సంగ నిర్వాహకులు ఐ.వి.కూర్మనాథం, దేవస్థాన కమిటీ సభ్యులు మార్టూరు అజయ్‌, నడిపల్లి బోసుబాబు, సత్యనారాయణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement