తన పొలంలో కూలీలతో కలిసి వరినాట్లు వేస్తున్న విద్యాశాఖ ఏడీ అప్పారావునాయుడు
నర్సీపట్నం: అనకాపల్లి జిల్లా డీఈవోగా పని చేసిన గిడ్డి అప్పారావునాయుడు పాడేరులో తన సొంత పొలంలో కూలీలతో కలిసి వరి నాట్లు వేస్తున్న దృశ్యమిది. ప్రస్తుతం తన వాట్సాప్ స్టేటస్‌లో చక్కర్లు కొడుతుంది. జిల్లా విద్యాశాఖ అధికారిగా అప్పారావునాయుడు నిబద్ధత..నిజాయితీతో పని చేసి అందరి మన్ననలు పొందారు. ప్రస్తుతం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ) మీడ్డే మీల్ విభాగం అధికారిగా ఉన్నారు. అప్పారావునాయుడు తనకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తూనే, తనకు వ్యవసాయంపై ఉన్న మక్కువతో కూలీలతో కలిసి వరి నాట్లు వేసి రైతు బిడ్డ అనిపించుకున్నారు.


