మాకవరపాలెం: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విద్యా హక్కు చట్టంపై మంగళవారం స్థానిక కేజీబీవీలో విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా బాలల సంరక్షణ అధికారి ఎం.రమేష్ మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో పేద పిల్లలకు 25 శాతం సీట్లు ఇవ్వాలని, 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత విద్య, మౌలిక సదుపాయాలు కల్పించే అంశాలపై వివరించారు. రక్షణ అధికారి మనోహర్ మాట్లాడుతూ పిల్లల హక్కులకు భంగం కలిగితే 1098, 181 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు. ఉపాధ్యాయులు, చైల్డ్ లైన్ కేస్ వర్కర్ శారదాదేవి, రూప పాల్గొన్నారు.


