నర్సీపట్నం: నర్సీపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠ శాల విద్యార్థిని సింధు జిల్లా స్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్ అథ్లెటిక్స్ 800 మీటర్స్‌లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి, ద్వితీయస్థానం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. ఆ విద్యార్థినిని పాఠశాల హెచ్‌ఎం, ఎంఈవో సిహెచ్.తలుపులు, పీడీ, ఇన్‌ఛార్జి హెచ్‌ఎం నూకరాజు, ఉపాధ్యాయు లు బద్రీనారాయణ, లక్షణరావు, ధర్మరాజు అభినందించారు.
నర్సీపట్నం: రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు పెదబొడ్డేపల్లి గురుకుల పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. వీరందరినీ ప్రిన్సిపాల్ వి.వి.రాజేంద్ర ప్రసాద్ అభినందించారు. జిల్లాస్థాయి అమరావతి చాంఫియన్‌షిప్ పోటీల్లో కబడ్డీ కె.ఆశోక్, ఎ.లోకేష్, వాలీబాల్ పి.ప్రసాద్, వెయిట్ లిప్టింగ్ ఎ.రోహిత్, లాంగ్‌జంప్ టి.జశ్వంత్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అద్భుతంగా రాణించిన విద్యార్థులు, తర్ఫీదు ఇచ్చిన పీడీ వినోద్‌ను ప్రిన్సిపాల్ అభినందించారు.
రాష్ట్ర స్థాయి పోటీలకు 9 మంది ఎంపిక
మాకవరపాలెం: అమరావతి ఛాంపియన్ షిప్ పోటీ ల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను ఎంపీడీవో చాయిసుధ, ఎంఈవోలు మూర్తి, ప్రసాద్, డిప్యూటీ ఎంపీడీవో మేరీజోన్స్ అభినందించారు. ఇటీవల అనకాపల్లిలో జరిగిన అమరావతి ఛాంపియన్ షిప్ లో కబ డ్డీ, వాలీబాల్, ఖోఖో, చెస్, రన్నింగ్ పోటీల్లో మాక వరపాలెం, బూరుగుపాలెం ఉన్నత పాఠశాలల నుంచి తొమ్మిది మంది విద్యార్థులు జిల్లాస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని ఎంఈవో మూర్తి మంగళవారం తెలిపారు. వీరిని ఆయనతోపాటు ఎంపీడీవో, డిప్యూటీ ఎంపీడీవో అభినందించారు.
మాకవరపాలెం: రాష్ట్రస్థాయి ఆటల పోటీలకు 32 మంది అవంతి కళాశాల విద్యార్థులు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ మోహనరావు మంగళవారం తెలిపారు. ఈ నెల 8 నుంచి 10 వరకు అనకాపల్లిలో నిర్వహించిన జిల్లాస్థాయి అమరావతి ఛాంపియన్ షిప్ పోటీల్లో తమ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారన్నారు. అయితే బాక్సింగ ఖోఖో, యోగా, బాడ్మింటన్, కబడ్డీ, వాటీబాల్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు తమ ప్రతిభను చూపి 32 మంది రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. తిరుపతిలో జరగనున్న పోటీల్లో పాల్గొంటారని, అక్కడ కూడా ఉత్తమ ప్రతిభను కనబరచాలని ఆకాంక్షించారు.


