నర్సీపట్నం: పెదబొడ్డేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఉమ్మడి జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ఇ.తేజస్విని, ఆర్.తనుశ్రీ, పి.యమున, యు.జాహ్నవి, పి.మేఘన జిల్లా స్థాయి పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచారు. వీరిని వ్యాయామ ఉపాధ్యాయులు పి.అచ్చమ్మ, బి.లక్ష్మిలను హెచ్‌ఎం జి.రవి, చైర్మన్ మాకిరెడ్డి సంతోషి అభినందించారు. ఈ నెల 9, 10, 11 తేదీల్లో కాకినాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో వీరు పాల్గొననున్నారని హెచ్‌ఎం తెలిపారు.
కశింకోట: స్థానిక డీపీఎన్ జెడ్పీ హైస్కూల్ విద్యార్థి ఎస్.యోగేంద్రబాబు రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎంపికయ్యాడు. గోపాలపట్నం జెడ్పీ హైస్కూలులో నిర్వహించిన స్కూలు గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలో యోగేంద్రబాబు సత్తా చాటాడు. ఈ నెల 9 నుంచి మూడు రోజుల పాటు భీమవరంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో విద్యార్థి పాల్గొంటాడని హెచ్‌ఎం ప్రసాద్ తెలిపారు.


