రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలకు క్రీడాకారుల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలకు క్రీడాకారుల ఎంపిక

Oct 7 2026 12:11 AM | Updated on Oct 7 2026 12:11 AM

బ్యాడ్మింటన్‌ టోర్నీకి ఎంపికై న ఉమ్మడి విశాఖ జిల్లా క్రీడాకారులతో పీఈటీలు

అనకాపల్లి: ఉమ్మడి విశాఖ జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో అండర్‌–17 బ్యాడ్మింటన్‌ ఎంపిక పోటీలు మంగళవారం అనకాపల్లి మెయిన్‌ రోడ్డులోని జార్జిక్లబ్‌ ఆవరణలో నిర్వహించారు. ఈ పోటీలకు ఉమ్మడి జిల్లా పరిధి నుంచి 125 మంది బాలురు, 25 మంది బాలికలు హాజరై ప్రతిభను చాటారు. వీరిలో బాలురు, బాలికల విభాగాల్లో ఆరుగురు చొప్పున మొత్తం 12 మందిని రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలకు ఎంపిక చేసినట్లు జిల్లా ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి ఎం.ఎం.మనోహర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రీడా అడ్మిన్‌ కార్యదర్శి కమల, మాజీ స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ కొణతాల సత్యనారాయణ, వ్యాయామ ఉపాధ్యాయులు కె.ఎం.నాయుడు, పీలా వీరునాయుడు, జయబాబు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement