రావికమతం: విజయవాడలో సోమవారం జరిగిన రాష్ట్ర స్థాయి 8వ పారా స్విమ్మింగ్ చాంపియన్ షిప్–2026 పోటీల్లో రావికమతం మండలానికి చెందిన దివ్యాంగ విద్యార్థులు సత్తా చాటి రెండు సిల్వర్ మెడల్స్ సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన 150 మంది పారా క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో కొట్యాడ రాము 50 మీటర్లు, సలాది మురళీ 100 మీటర్ల శారీరక వైకల్యం విభాగాల్లో ఈ పతకాలు సాధించారు. వీరికి పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు, రాష్ట్ర సెక్రటరీ వి. రామస్వామి, ఏపీ సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం కన్సల్టెంట్ డాక్టర్ నరసింహం మెడల్స్ ప్రదానం చేశారు. మంగళవారం మేడివాడ జెడ్పీ పాఠశాలలో రాము, మురళీలను ప్రత్యేక ఉపాధ్యాయుడు బొడ్డు మహాలక్ష్మినాయుడు, ఎంఈవోలు లింగమూర్తి, బ్రహ్మాజీ, తదితరులు అభినందించారు.


