చైన్‌ స్నాచింగ్‌ ముఠా అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

చైన్‌ స్నాచింగ్‌ ముఠా అరెస్ట్‌

Oct 7 2026 12:11 AM | Updated on Oct 7 2026 12:11 AM

● నిందితుల్లో ఒకరు హోంగార్డు

పెద్దేరు కాలువలో పడి వృద్ధుడి మృతి

అనకాపల్లి: పట్టణ పరిధిలో చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 4.5 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ క్రైం ఎస్‌ఐ అల్లు వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. సుంకరమెట్ట జంక్షన్‌ వద్ద వాహనాల తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీల విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. రాజస్థాన్‌లోని నాగౌర్‌ జిల్లా పంచవటి గ్రామానికి చెందిన, ప్రస్తుతం మధురవాడ చంద్రంపాలెంలో నివాసం ఉంటున్న మహేందర్‌ సింగ్‌ అలియాస్‌ మహేంద్ర (మాజీ రాపిడో బైక్‌ రైడర్‌), కొమ్మాది జంక్షన్‌ శ్రీకృష్ణ గాయత్రి వైభవ్‌నగర్‌కు చెందిన మండ్రు లతారత్నాకర్‌ (52)ను అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు మహేందర్‌ సింగ్‌ 2007లో సైబరాబాద్‌ కమిషరేట్‌ పరిధిలో హోంగార్డుగా పనిచేశాడని, అనంతరం జల్సాలు, మద్యానికి బానిసై నేరాల బాట పట్టాడని చెప్పారు. 2013–2015 మధ్య జీడిమెట్ల, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మియాపూర్‌ తదితర ప్రాంతాల్లో ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని సుమారు 36 బంగారు గొలుసుల చోరీలకు పాల్పడి జైలుశిక్ష అనుభవించాడన్నారు. జైలు నుంచి విడుదలైన అనంతరం మధురవాడకు మకాం మార్చిన మహేంద్ర రాపిడో బైక్‌ నడుపుతూ విశాఖ, అనకాపల్లి, శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరు తదితర ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్‌స్నాచింగ్‌కు పాల్పడేవాడని ఎస్‌ఐ తెలిపారు. చోరీ చేసిన బంగారాన్ని లతారత్నాకర్‌కు అప్పగించేవాడని, ఆమెకు పరిచయమున్న నగల దుకాణాల్లో వాటిని విక్రయించి వచ్చిన సొమ్మును ఇద్దరూ పంచుకునేవారని వివరించారు. అరెస్టు చేసిన ఇద్దరినీ కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించినట్లు ఎస్‌ఐ తెలిపారు. పోలీసు సిబ్బంది హెచ్‌సీ జి.గాంధీ, కానిస్టేబుళ్లు ఎం.సముద్రం, ఆర్‌.పి.నాయుడు, టి.ఎస్‌.నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement