అనకాపల్లి: జన్మించిన ప్రతి జీవి ఆరోగ్యంగా ఉండాలని, పర్యావరణ పరిరక్షణ, మొక్కలను నాటి వాటి పర్యవేక్షణ చేయాలని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. తమ కార్యాలయంలో మంగళవారం హరిత ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. మానవ మనుగడకు, ఆరోగ్యకరమైన జీవితానికి మొక్కలు అత్యంత అవశ్యకమని అన్నారు. చెట్ల ద్వారా స్వచ్ఛమైన ఆక్సిజన్ అభించమే కాకుండా పర్యావరణ సమతుల్యత కాపాడుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కనీసం ఒక మొక్కనైనా నాటి పూర్తి బాధ్యత స్వీకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన్‌రావు, డీఎస్పీ కె.రవికుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


