కోటవురట్ల: అధికారం మనది..మనమేం చేసినా అడ్డేవాడెవరు.. ఇదీ ప్రస్తుతం పలు చోట్ల టీడీపీ నేతల అడ్డగోలు దందా..పాములవాకలో ఓ టీడీపీ కార్యకర్త ప్రభుత్వ చేతిబోరును కబ్జాచేసి తన సొంత బోరుగా వాడేసుకుంటున్నాడు. ఎంపీటీసీ నిధులతో రైతుల మకాముల వద్ద వేసిన చేతిబోరు హెడ్‌ను ఊడదీసి మోటారును ఏర్పాటు చేసుకుని దర్జాగా వినియోగిస్తున్నాడు. ఇదేంటని ప్రశ్నించిన రైతులకు మీ దిక్కున్న చోట చెప్పుకోండని సమాధానం చెబుతున్నాడు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు తక్షణమే స్పందించకపోతే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని పలువురు రైతులు హెచ్చరిస్తున్నారు. మిగతా రైతులు ఇబ్బంది పడుతున్నా అఽధికారులు చర్యలు తీసుకోకపోవడం దారుణమని విమర్శిస్తున్నారు.


