డీఎస్సీ పోరుకు..
చోడవరంలో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ సంఘీభావం
సాక్షి, అనకాపల్లి: డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగిన అవకతవకలపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. అక్రమార్కులకు శిక్ష పడేవరకూ, న్యాయం జరిగే వరకూ ఉద్యమం ఆగదని దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. సీబీఐ విచారణ జరపాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం విజయవంతంగా సాగాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి అందించాలని ఈ సందర్భంగా పలువురు డిమాండ్ చేశారు. ఈ దీక్షల్లో పెద్ద ఎత్తున యువకులు, నిరుద్యోగులు పాల్గొన్నారు. యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురంలో జరిగిన రిలే నిరాహార దీక్షలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, మాడుగులలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, చోడవరంలో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పాల్గొని సంఘీభావం తెలిపారు. నర్సీపట్నం, చోడవరం నియోజకవర్గాల్లో పార్లమెంట్ పరిశీలకులు శోభా హైమావతి పాల్గొని సంఘీభావం తెలిపారు.
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రెండో రోజూ కొనసాగిన దీక్షలు
పెందుర్తి
అనకాపల్లి
నర్సీపట్నం నియోజకవర్గంలోని గొలుగొండ లో నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో రెండో రోజు రిలే నిరాహార దీక్ష విజయవంతంగా జరిగింది. ఈ దీక్షకు పార్లమెంట్ పరిశీలకులు శోభా హైమావతి, మాజీ ఎంపీ భీశెట్టి సత్యవతి సంఘీభావం తెలిపారు. జిల్లా మహిళా అధ్యక్షురాలు లోచల సుజాత, జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు, ఎంపీపీ గజ్జలపు మణికుమారి, వైఎస్ ఎంపీపీలు సుర్ల బాజ్జి, జక్కు నాగమణి పాల్గొన్నారు.
అనకాపల్లి పట్టణంలో నెహ్రూచౌక్ వద్ద నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్ ఆధ్వర్యంలో రెండో రోజు రిలే నిరాహార దీక్ష విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌కుమార్, ఎంపీపీ గొర్లి సూరిబాబు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
నర్సీపట్నం


