నేను బీఎస్సీ డీఎడ్ చదువుకున్నాను. ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ భృతి అందిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అమలు కాలేదు. గతంలో డీఎస్సీలో అందరికీ ఒకే పేపర్ ఉండేది. కూటమి ప్రభుత్వం ఆన్‌లైన్ విధానం తీసుకువచ్చి అనేక విభాగాలుగా పరీక్షలు నిర్వహించి గందరగోళానికి గురిచేసింది. నార్మలైజేషన్ తీసుకొచ్చి దాన్ని శాసీ్త్రయ పద్ధతిలో చేయకపోవడం వల్ల ప్రతిభ ఉన్న విద్యార్థులకు న్యాయం జరగలేదు. ఇప్పటికై నా అర్హులైన డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలి.
– కసిరెడ్డి రామకృష్ణ,
మంచాల గ్రామం,
చీడికాడ మండలం


