డీఎస్సీలో అక్రమాల వల్ల అర్హులకు న్యాయం జరగలేదు. నిరుద్యోగులకు భృతి ఇస్తామన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన 26 నెలలకుగాను నిరుద్యోగ భృతి ఒకేసారి ఒక్కొక్కరీకి రూ. 78 వేలు అందజేసి ఆదుకోవాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి మాదిరిగా నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి. లేదంటే మాలాంటి నిరుద్యోగ యువత ఆ గ్రహజ్వాలలకు గురికావాల్సి వస్తుంది. మాకు న్యాయం జరిగే వరకు పోరాటం సాగిస్తాం.
– బొడ్డు సన్యాసిరావు,
నిరుద్యోగ యువకుడు,
చీడికాడ గ్రామం/మండలం


