డ్రోన్లతో లక్ష విత్తన బంతులు | - | Sakshi
Sakshi News home page

డ్రోన్లతో లక్ష విత్తన బంతులు

Aug 8 2026 12:47 AM | Updated on Aug 8 2026 12:47 AM

రావికమతం: అడవుల విస్తీర్ణాన్ని పెంచి, పచ్చదనాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా అటవీ శా ఖ ఆధ్వర్యంలో లక్ష విత్తన బంతులు వెదజల్లే కార్యక్రమాన్ని చేపట్టినట్టు చోడవరం అటవీశాఖ అధికారి సింహాచలం తెలిపారు. డ్రోన్ల ద్వారా చీమలపాడు పంచాయతీ పరిధిలోని అటవీ ప్రాంతంలో శుక్రవారం విత్తన బంతులను వెదజల్లారు. ఈ సందర్భంగా సింహాచలం మాట్లాడుతూ 15 వృక్ష జాతులకు చెందిన విత్తనాలను సేకరించి వన సేవకులు, సిబ్బంది సహకారంతో విత్తన బంతులు వెదజల్లుతున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో మేడివాడ సెక్షన్‌ ఫారెస్టు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement