అధినేతతో ఆత్మీయ కలయిక | - | Sakshi
Sakshi News home page

అధినేతతో ఆత్మీయ కలయిక

Aug 7 2026 1:14 AM | Updated on Aug 7 2026 1:14 AM

నర్సీపట్నం : వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని పార్టీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రు డు, డీసీసీబీ మాజీ చైర్‌పర్సన్‌ అనిత సన్యాసిపాత్రుడు కుటుంబసభ్యులతో తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. కుమారులు పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు వరుణ్‌, ఉదయ్‌ కిరణ్‌ మర్యాద పూర్వకంగా కలిశారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల కమిటీల్లో చోటు

సాక్షి,అనకాపల్లి: వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీలో రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల కమిటీలలో వివిధ హోదాలలో నియమించారు. ఈ మేరకు గురువారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర బీసీ సెల్‌ కార్యదర్శిగా ఉద్ధండం త్రినాధ్‌రావు(యలమంచిలి), జిల్లా సోషల్‌మీడియా వింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా మాసరపు శివ(యలమంచిలి), జిల్లా సోషల్‌ మీడియా వింగ్‌ కార్యదర్శిగా కాండ్రేగులు రాజు(యలమంచిలి), జిల్లా సోషల్‌ మీడియా వింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా కాండ్రగుల ప్రకాష్‌రావు, దేవరకొండ ఈశ్వర్‌ కుమార్‌(యలమంచిలి)ను నియమించారు.

9న జూలో చిత్రలేఖన పోటీలు

ఆరిలోవ: ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 9న జూ పార్కులో విద్యార్థులకు ఏనుగుల అంశంపై చిత్రలేఖన పోటీలు నిర్వహించనున్నట్లు జూ క్యూరేటర్‌ జి.మంగమ్మ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జూ బయోస్కోప్‌లో ఈ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు కేటగిరి–1, ఆరు నుంచి పదో తరగతి వరకు కేటగిరి–2, ఇంటర్మీడియట్‌ నుంచి పీజీ వరకు కేటగిరి–3గా విభజించనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి గల విద్యార్థులు 7893632900 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement