అనకాపల్లి నియోజకవర్గం.. | - | Sakshi
Sakshi News home page

అనకాపల్లి నియోజకవర్గం..

Aug 7 2026 1:14 AM | Updated on Aug 7 2026 1:14 AM

నకాపల్లి నియోజకవర్గంలో కశింకోటలో జాతీయ రహదారి పక్కన నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్‌ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్లమెంట్‌ పరిశీలకులు శోభా హైమావతి, మాజీ ఎంపీ భీశెట్టి సత్యవతి దీక్షలకు సంఘీభావం తెలియజేశారు. ముందుగా వైఎస్సార్‌ విగ్రహానికి పూలతో నివాళులర్పించి దీక్షలను ప్రారంభించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌ నిమ్మరసం తాగించి తొలిరోజు దీక్షలను విరమింపచేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు సతీష్‌వర్మ, రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌కుమార్‌, జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షుడు పెంటకోట శ్రీనివాసరావు, పార్టీ మండలాధ్యక్షుడు మలసాల కిషోర్‌, సీనియర్‌ నాయకుడు మళ్ల బుల్లిబాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement