అనకాపల్లి: స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారిని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, సినీనటుడు సోనూసూద్‌లు బుధవారం రాత్రి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నూతన ఆలయంలో అమ్మవారిని దర్శంచుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. అనంతరం ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను, ఈవో యాళ్ల శ్రీధర్‌లు రాంప్రసాద్‌రెడ్డి, సోనూసూద్‌లను శాలువాలతో సత్కరించి, అమ్మవారి చిత్రపటాలు, ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజారవాణాశాఖ జిల్లా అధికారిణి వి.ప్రవీణ, ఆలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నసినీ నటుడు సోనూసూద్
నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి


