మాడుగుల: ప్రభుత్వ నిర్దేశించిన ప్రకారం గర్భిణులు, పిల్లలకు పంపిణీ చేసే ఆహారంలో తేడా వస్తే సహించేది లేదని, రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు లక్ష్మీ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం మాడుగులలో సివిల్ సప్లయ్ గొడౌన్ లో సరుకులు పరిశీలించి తూకంలో తేడాలు చూశారు. రికార్డులు పరిశీలించారు. అనంతరం తాటిపర్తి గిరిజన ఆశ్రమోన్నత బాలికల వసతి గృహంతో పాటు కస్తూర్బా గాంధీ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించారు. స్టాక్ వేసిన కూరగాయలు, పప్పులు, తదితర వస్తువులు పరిశీలించారు. భోజనం నాణ్యత బాగుండడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.వి.ఎల్.ఎం.మూర్తి, జిల్లా పౌరసరఫరాల అధికారి టి. వెంకటరమణ, పుడ్ సేఫ్టీ అధికారి బి.రవికుమార్ పాల్గొన్నారు.


