కశింకోట పీఏసీఎస్‌కు పురస్కారం | - | Sakshi
Sakshi News home page

కశింకోట పీఏసీఎస్‌కు పురస్కారం

Aug 5 2026 12:54 AM | Updated on Aug 5 2026 12:54 AM

కశింకోట: కశింకోట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి 2025–26 సంవత్సరానికి ‘బెస్ట్‌ ఫెర్ఫార్మెన్స్‌’ పురస్కారం లభించింది. విజయవాడలో నిర్వహించిన ఏపీ స్టేట్‌ కోఆపరేటివ్‌ బ్యాంకు 63వ ఫార్మేషన్‌ డే వేడుకల సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఆప్కాబ్‌ చైర్మన్‌ గన్నె వీరాంజనేయులు, డీసీసీబీ చైర్‌ పర్సన్‌ కోన తాతారావు చేతుల మీదుగా సంఘ చైర్‌ పర్సన్‌ సిదిరెడ్డి శ్రీనివాసరావు, సీఈవో ద్వారపురెడ్డి నూకేశ్వరరావు పురస్కారాన్ని అందుకున్నారు. పురస్కారం రావడం జిల్లా సహకార రంగానికి గర్వ కారణంగా నిలిచిందని పలువురు అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement