మాడుగుల: మండలంలోని తాటిపర్తి వద్ద తారకరామ జలాశయం నుంచి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మంగళవారం సాగునీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల జలాశయాల్లో నీరు తక్కువగా ఉందన్నారు. అవసరం మేరకు పొదుపుగా వాడుకోవాలన్నారు. ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టి సాగునీరు విడుదల చేశారు. ప్రతి నీటి బొట్టు రైతులకు అందజేయడానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పుప్పాల అప్పలరాజు, పెద్దేరు నీటి సంఘం చైర్మన్ అద్దేపల్లి జగ్గారవు, పుప్పాల లక్ష్మీనారాయణ, ఆయకట్టు రైతులు పాల్గొన్నారు.


