బస్సుల సంఖ్య పెంచాలని నిరసన | - | Sakshi
Sakshi News home page

బస్సుల సంఖ్య పెంచాలని నిరసన

Aug 4 2026 1:05 AM | Updated on Aug 4 2026 1:05 AM

ఏపీఎస్‌ ఆర్టీసీని కాకుండా ప్రైవేట్‌ వ్యవస్థలకు విద్యుత్‌ బస్సులు ఇవ్వొద్దని, సీ్త్రశక్తి స్కీం వల్ల పెరిగిన మహిళ ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలని, ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏపీపీటీడీ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో (ఆర్టీసీ) ఉద్యోగులు కలెక్టరేట్‌ వద్ద నిరసన చేశారు. జేఏసీ ఉద్యమంలో 3వ విడత పిలుపులో భాగంగా ఉద్యోగుల సంతకాలతో కూడిన వినతిపత్రం కలెక్టర్‌కు అందించామని నాయకులు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా కొత్త సమస్యలు తీసుకురావడం అన్యాయమన్నారు. వీటిపై ఉద్యోగులంతా పోరాటం చేస్తామన్నారు. జిల్లా జేఏసీ నాయకులు, అనకాపల్లి డిపో జేఏసీ నాయకులు, నర్సీపట్నం డిపో జేఏసీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement