ఎన్నికల ముందు హామీలిచ్చిన లోకేష్ ఇప్పుడు కనీసం స్పందించడం లేదు. స్కీం వర్కర్ల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం గత ప్రభుత్వంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో నేరుగా పాల్గొని భరోసా కల్పించిన కూటమి నాయకులు, అధికారం చేపట్టి సమయం గడుస్తున్నప్పటికీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. స్కీం వర్కర్లకు మరింత ఒత్తిడి వచ్చేలా పనిభారం పెంచేస్తున్నారు. తక్షణమే వారి హామీలు అమలు చేయకపోతే ‘చలో అమరావతి’ చేపట్టాల్సి వస్తుంది.
– గంటా శ్రీరామ్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు, అనకాపల్లి


