నేను చోడవరం గర్ల్ హైస్కూల్‌లో గత 23 ఏళ్లుగా పనిచేస్తున్నాను. వేతనాలు ఆలస్యమైనా వంట సరుకు లు అప్పు తెచ్చి మరీ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నాం. తక్షణమే స్మార్ట్ కిచెన్ విధానం తొలగించి, తమ డిమాండ్‌లను పరిష్కరించాలి. ప్రమాద బీమాతో పాటు ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే తమ కుటుంబాలు వీధిన పడతాయి. కేంద్రీకృత వంటశాలల పేరుతో ప్రైవేట్ సంస్థలకు బాధ్యతలు అప్పగిస్తే తాము రోడ్డున పడతాం. అలాంటి కుట్రలను తక్షణమే విరమించుకోవాలి.
– గూనూరు వరలక్ష్మి, మిడ్ డే మీల్స్ వంట కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు


