న్యూస్‌రీల్
అర్హులందరికీ సకాలంలో పింఛన్లు అందాలి
అభివాదం
చేస్తున్న
వైఎస్ జగన్
సాక్షి, విశాఖపట్నం: శ్రీకాకుళం పర్యటనకు బయలుదేరిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి విశాఖపట్నంలో గురువారం అపూర్వ స్వాగతం లభించింది. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి తగరపువలస వరకు రహదారులన్నీ అభిమానులు, పార్టీ శ్రేణులతో కిక్కిరిసిపోయాయి. పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు విధించి, బ్యారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ జనసందోహం ఏమాత్రం తగ్గలేదు. రహదారులకు ఇరువైపులా నిలబడి ప్రజలు చేతులు ఊపుతూ జననేతకు అభివాదం చేయగా, వైఎస్ జగన్ చిరునవ్వుతో ప్రతి ఒక్కరికీ ప్రతిస్పందించారు. పలు కూడళ్లలో డీజేలు, నృత్యాలతో కార్యకర్తలు ఉత్సాహంగా స్వాగతం పలకడంతో పండగ వాతావరణం నెలకొంది. పర్యటన సందర్భంగా మార్గమధ్యంలో పలువురు ప్రజలు తమ సమస్యలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. ఎయిర్‌పోర్టు కాంట్రాక్ట్ కార్మికులు, కాందిశీకులు, పంచగ్రామాల ప్రజలు, డేటా సెంటర్ భూ నిర్వాసిత రైతులు వినతిపత్రాలు అందజేశారు. భూములు ఇచ్చినా ఇప్పటికీ పరిహారం అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
మూడు గంటల పాటు సాగిన పర్యటన
ఉదయం 11 గంటలకు విశాఖ విమానాశ్రయం నుంచి ప్రారంభమైన రోడ్డు మార్గ పర్యటన ఎన్‌ఏడీ జంక్షన్, గోపాలపట్నం, అడవివరం, సత్తరువు జంక్షన్, నీళ్లకుండీలు, ఆనందపురం, తగరపువలస మీదుగా శ్రీకాకుళం వైపు సాగింది. విశాఖ జిల్లాలో ఈ పర్యటన సుమారు మూడు గంటల పాటు కొనసాగింది. మధ్యాహ్నం 1.35 గంటలకు ఎమ్మెస్సార్ ఫంక్షన్ హాల్ జంక్షన్ దాటి విజయనగరం జిల్లాలోకి ప్రవేశించారు. అనంతరం శ్రీకాకుళం పర్యటన ముగించుకుని రాత్రి 8.20 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి విమానంలో బెంగళూర్‌కు బయలుదేరారు.
పోలీసుల ఆంక్షలు.. అభిమానుల ఉత్సాహం
వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీగా ఆంక్షలు విధించారు. పర్యటన మార్గమంతా బారికేడ్లు ఏర్పాటు చేశారు. మాజీ సీఎంను కలిసేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్‌రెడ్డి, పార్టీ శ్రేణులను ఎయిర్‌పోర్టు వద్ద నిలువరించడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం కార్యకర్తలతో కలిసి లోపలికి వెళ్లారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ వాహనాన్ని ఎయిర్‌పోర్టు వైపు వెళ్లకుండా పోలీసులు నిలిపివేయడంతో ఆయన కాలినడకనే విమానాశ్రయానికి చేరుకున్నారు.
కాన్వాయ్‌ను అడ్డుకున్నా ఆగని అడుగులు
వైఎస్ జగన్ కాన్వాయ్‌తో పాటు వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, మాజీ ఎమ్మెల్యేల వాహనాలు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు వేసి సుమారు అరగంటపాటు ఎయిర్‌పోర్టు వద్ద నిలిపివేశారు. వాహనాలు నిలిపివేసినా తమ అధినేతను అనుసరించేందుకు పలువురు నాయకులు కాలినడకనే కాన్వాయ్ వెనుక బయలుదేరారు. చివరకు వైఎస్ జగన్ కాన్వాయ్ వెళ్లిన అరగంట తర్వాతే ఇతర ప్రజాప్రతినిధుల వాహనాలకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఆంక్షలు ప్రజల ఆదరణను ఏమాత్రం తగ్గించలేకపోయాయి.
ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం
విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్‌కు పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రులు పేర్ని నాని, గుడివాడ అమర్‌నాథ్, విశాఖ, విజయనగరం, అనకాపల్లి జిల్లాల అధ్యక్షులు కేకే రాజు, మజ్జి శ్రీనివాసరావు, బొడ్డేడ ప్రసాద్, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, వరుదు కల్యాణి, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, జెడ్పీ చైర్‌పర్సన్ జె.సుభద్ర, పీఏసీ సభ్యుడు తిప్పల నాగిరెడ్డి, సమన్వయకర్తలు దేవన్ రెడ్డి, మళ్ల విజయప్రసాద్, మొల్లి అప్పారావు, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్, పెట్లా ఉమాశంకర్ గణేష్, కరణం ధర్మశ్రీ, కంబాల జోగులు, అదీప్‌రాజ్, తైనాల విజయ్‌కుమార్, మాజీ ఎంపీ భీశెట్టి సత్యవతి, మహిళా నేత సిరి సహస్ర, మాజీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, మాజీ డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్, కె.సతీష్, మాజీ మంత్రి బాలరాజు, నియోజకవర్గ పరిశీలకులు పేడాడ రమణికుమారి, వీసం రామకృష్ణ, గండి రవి తదితరులు స్వాగతం పలికారు.
అసకపల్లిలో పింఛన్లు అందిస్తున్న
కలెక్టర్ విజయకృష్ణన్
సబ్బవరం: అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఎన్‌టీఆర్ భరోసా పింఛన్లు సకాలంలో, పారదర్శకంగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. మండలంలోని అసకపల్లిలో గురువారం నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని వృద్ధులు, వితంతువులు, వికలాంగుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛన్లు అందించారు. లబ్ధిదారులతో మాట్లాడి పంపిణీ తీరుపై ఆరా తీశారు. జిల్లాలో మొత్తం 2,51,357 మంది లబ్ధిదారులకు రూ.226.29 కోట్ల పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గురువారం ఉదయం నాటికి 90.03 శాతం పంపిణీ పూర్తయిందన్నారు. మిగిలిన లబ్ధిదారులకు కూడా పింఛన్లు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
నీళ్లకుండీల జంక్షన్ వద్ద
గోపాలపట్నం వద్ద
బర్మా కాందిశీకుల సమస్యలపై వినతి
కాకాణినగర్ వద్ద బర్మా కాందిశీకుల ప్రతినిధులు వైఎస్ జగన్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. నెహ్రూనగర్ పరిధిలోని సర్వే నంబర్ 13/ఏ/14లో ఉన్న మూడు ఎకరాల మిగులు భూమిని అర్హులైన బర్మా కాందిశీకులకు కేటాయించకుండా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ విషయమై పలుమార్లు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని, ఇళ్లులేని పేద కాందిశీకులకు ఆ స్థలాన్ని కేటాయించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మైనింగ్ ఏడీ శ్రీనివాస్ సస్పెన్షన్
అడుగడుగునా వైఎస్ జగన్‌కు బ్రహ్మరథం పట్టిన అభిమానులు విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి తగరపువలస వరకు పోటెత్తిన జనం పోలీసుల ఆంక్షలను లెక్కచేయని కార్యకర్తలు, అభిమానులు
వైఎస్సార్‌సీపీ జిల్లా అనుబంధ విభాగాల్లో నియామకాలు
అనకాపల్లి : వైఎస్సార్‌సీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ జిల్లా అనుబంధ విభాగాల కమిటీల్లో వివిధ హోదాల్లో నియమించినట్టు గురువారం కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా రజక విభాగం అధ్యక్షునిగా వాడపర్తి కుసరాజు(పాయకరావుపేట), జిల్లా సోషల్ మీడియా వింగ్ ఉపాధ్యక్షుడుగా బైలపూడి నానిబాబు(నర్సీపట్నం), జిల్లా సోషల్ మీడియా వింగ్ ప్రధాన కార్యదర్శులుగా కడవల శివ(నర్సీపట్నం), తంగేల రామకృష్ణారావు(అనకాపల్లి), గేదెల చిన్నఅప్పలరాజు(పాయకరావుపేట), జిల్లా సోషల్ మీడియా వింగ్ కార్యదర్శులుగా ఆర్యసోమయా జులు శివకుమార్(అనకాపల్లి), మామిడి కాలి తారకేశం(అనకాపల్లి), గుడిమెట్ల శ్రీరామ్‌రాజు (పాయకరావుపేట), కొల్లి గోపాలకృష్ణ(పాయకరావుపేట), చేపల రాజు (పాయకరావుపేట), జిల్లా సోషల్ మీడియా వింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లు బి.వేమేష్(నర్సీపట్నం), భీమిరెడ్డి వెంకయ్యనాయుడు(నర్సీపట్నం) నియమితులయ్యారు.


