తుమ్మపాల : జిల్లాలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, పారిశ్రామిక కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద సీఐటీయు ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయు రాష్ట్ర కమిటీ సభ్యులు జి.కోటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శంకరరావు మాట్లా డుతూ షెడ్యూల్డ్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు 15 ఏళ్లగా వేతనాలు సవరించకపోవడంతో చాలీ చాలని జీతాలతో పనిచేయాల్సి వస్తుందని, విద్యా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏడేళ్లుగా వేతనాలు పెంచ లేదన్నారన్నారు. ఎస్‌ఎస్‌ఏ వైద్య ఆరోగ్యశాఖ పంచాయతీ, మున్సిపల్ ఉద్యోగులకు రెండు నుంచి ఆరు నెలల జీతాలు బకాయిలు ఉన్నాయన్నారు. విద్యుత్ రంగంలో నర్సీపట్నం డివిజన్ పరిధిలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎల్‌ఎంసీ అదనపు డ్యూటీలు వేయడంతో పాటు, వేతనంతో కూడిన సెలవులు నగదును ఏడేళ్లుగా చెల్లించలేదన్నారు. ఫార్మాలో అభద్రతతో ఉద్యోగులు పని చేస్తున్నారని తెలిపారు. ఎన్‌టీపీసీలో డస్ట్ అలవెన్స్ వెంటనే చెల్లించాలని, వైద్య శాఖలో కంటిన్యూ వర్కర్స్ సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి.వి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గనిశెట్టి సత్యనారాయణ, ఆర్.రాము, గంట శ్రీరామ్, ఎ.రాజు, జి.దేవుడునాయుడు, సోమునాయుడు, దాకారపు శ్రీను, రైతు సంఘం నాయకులు గండి నాయనబాబు, ఈర్లి నాయుడుబాబు, బ్రహ్మాజీ, వ్యవసాయ మార్కెటింగ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు పి. శ్రీనివాసరావు, సమగ్ర శిక్ష జేఏసీ జిల్లా అధ్యక్షుడు తట్టా కృష్ణ, వెంకట్రావు, నాగేశ్వరరావు, 108 కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.శ్రీరామూర్తి, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాగేశ్వరరావు, అప్పలరాజు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు అజయ్, భారతి, రాము, ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అవతారం, రాజేష్, సూరి అప్పారావు శేషు, ముసలి నాయుడు, ఫార్మా యూనియన్ నాయకులు మల్లేష్, ఆర్‌ఏఆర్‌ఎస్ నాయకులు లక్ష్మి, ఆర్టీసీ వర్కర్స్ డి.గంగాధర్, హైర్ బస్ వర్కర్ నాయకులు నాయుడు పాల్గొన్నారు.


