అప్పన్న సన్నిధిలో ఐటీ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ దంపతులు | - | Sakshi
Sakshi News home page

అప్పన్న సన్నిధిలో ఐటీ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ దంపతులు

Jul 20 2026 12:50 AM | Updated on Jul 20 2026 12:50 AM

సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఆదాయపు పన్ను శాఖ(ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ) ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ సురేష్‌ బట్టిని (ఐఆర్‌ఎస్‌), హైదరాబాద్‌ ఆదాయపు పన్ను శాఖ చీఫ్‌ కమిషనర్‌ సునీత బిల్లా(ఐఆర్‌ఎస్‌) దంపతులు ఆదివారం ఉదయం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో ఆయన పేరిట అర్చకులు స్వామికి అష్టోత్తర పూజ జరిపి, వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారి ప్రసాదం, శేషవస్త్రంలను ఏఈవో తిరుమలేశ్వరరావు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement