నర్సీపట్నం: నర్సీపట్నం ము న్సిపాలిటీ గ్రేడ్ పెంచుతూ ప్ర భుత్వం ఆదేశా లు జారీ చేసింది. గ్రేడ్ 3 నుంచి 1కు పెంచుతూ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపాలిటీ ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని స్థాయిని పెంచారు. గ్రేడ్ పెరగడంతో పట్టణ రూపురేఖలు మారడమే కాకుండా, పౌరసేవల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర తెలిపారు. భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అధిక నిధులు వస్తాయని, ఈ నిధులతో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు వీలుపడుతుందని కమిషనర్ పేర్కొన్నారు.


