ఆదుకుంటామని చెప్పి...
సభ్యరైతుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం. ఫ్యాక్టరీని, చెరకు రైతులను ఆదుకుంటామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చి తర్వాత పట్టించుకోలేదు. రైతులు, కార్మికుల బకాయిలు వెంటనే చెల్లించాలి. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలి.
–కాండ్రేగుల డేవిడ్, న్యాయవాది, చోడవరం బార్‌అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు
ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు
చెరకు రైతులు, కార్మికులు, ఫ్యాక్టరీ ఇంత ఇబ్బందుల్లో ఉంటే కేన్ కమిషనర్ కనీ సం పట్టించుకోలేదు. ఫ్యాక్టరీకి వచ్చి పరిశీలన చేయ లేదు. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు. స్థానిక ఎమ్మెల్యే, ప్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణం. ప్రభుత్వం వెంటనే సాయం చేసి, రైతులు, కార్మికుల బకాయిలు చెల్లించాలి. ఫ్యాక్టరీని తిరిగి నడిపించాలి.
– కె.వి.వి. భాస్కరరావు, గోవాడ సుగర్స్ గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు.
ఫ్యాక్టరీని మూసివేసేందుకు చర్యలు
ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సిందే. ఈ ప్రాంత చెర కు రైతులకు జీవనాధారమైన గోవాడ ఫ్యాక్టరీని నిర్వీర్యం చేయాలని ప్రభుత్వం యోచి స్తోంది. రైతులు, రైతుకూలీలు, కార్మికులు, రాజకీయ పార్టీలు అంతా సమష్టిగా పోరాటం చేయా ల్సిన పరిస్థితి వచ్చింది. రైతుల ఓట్లతో గద్దెక్కి వారి మనుగడనే దెబ్బతీస్తున్న ప్రభుత్వం కళ్లు తెరిపించాలి.
– కోన మోహనరావు, రైతు కూలీ సంఘం జిల్లా ప్రతినిధి
ఆదుకుంటామని చెప్పి...
ఆదుకుంటామని చెప్పి...


