ఉపాధ్యాయుల ఆత్మీయ కలయిక
కె.కోటపాడు : 30 సంవత్సరాల కిందట ఉపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించి, వివిధ ప్రదేశాల్లో విధులు నిర్వహిస్తున్న వారంతా సూదివలసలో కలుసుకుని సందడి చేశారు. 1995 డీఎస్సీలో కె.కోటపాడు మండలానికి చెందిన 22 మంది ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. వీరు ఉద్యోగ బాధ్యతలు చేపట్టి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో సహా హాజరయ్యారు. విధుల్లో చేరిన రోజులను గుర్తు చేసుకున్నారు. వీరిలో పలువురు ఉత్తమ సేవలతో పాటు సామాజిక, సేవా రంగాల్లో రాణిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందిన కె.కోటపాడు మండలానికి చెందిన ఎల్.వి.నారాయణరావును పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సూర్రెడ్డి బాబూరావు, బొడ్డు మహేశ్వరరావు(రవి), బొడ్డు వేణు, యడ్ల గోవింద, రామరాజు, సూరిశెట్టి రామకృష్ణ, రొంగలి నాగేంద్రజోగి, కన్నూరు అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.


