ప్రచారం మాది!
భోగాపురం ఎయిర్‌పోర్టు తమ ప్రభుత్వ హయాంలోనే మంజూరైందంటూ మంత్రుల ప్రకటనలు
గత ప్రభుత్వంలో మంజూరైన భవనాలకు ప్రారంభోత్సవం
మంత్రుల తీరుపై విస్తుపోతున్న జనం
●‘కూటమి’.. క్రెడిట్ చోరీ
అభివృద్ధి మీది,
నక్కపల్లి : పాయకరావుపేట నియోజకవర్గంలో సోమవారం పర్యటించిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లురవీంద్ర, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తదితరులు మాట్లాడుతూ భోగాపురం ఎయిర్‌పోర్టు కూటమి ప్రభుత్వ కృషి అంటూ చెప్పుకొచ్చారు. మండల కేంద్రం నక్కపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు, విద్యార్థులకు సీఎస్‌ఆర్ పథకం కింద 200 సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రి అనిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మంత్రులతోపాటు, ఎంపీ సీఎం రమేష్ హాజరయ్యారు. ఈ సభలో మంత్రులు మాట్లాడుతూ 2014–19 మధ్యకాలంలో చంద్రబాబు, లోకేష్, అశోక్ గజపతిరాజు ఎంతో కృషి చేసి ఎయిర్‌పోర్టు తీసుకు వచ్చారంటూ డప్పుకొట్టారు. వాస్తవంగా ఈ భోగాపురం ఎయిర్‌పోర్టు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే శంకుస్థాపన జరిగింది. రైతుల నుంచి సేకరించిన భూములకు నష్టపరిహారం చెల్లింపు, విమానాశ్రయానికి శంకుస్థాపన వంటి కార్యక్రమాలు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలోనే జరిగాయి. పనులు సైతం 2023 సెప్టెంబర్ నాటికి 8 6 శాతం పూర్తయ్యాయని ప్రస్తుతం పౌర విమానయానశాఖామంత్రిగా ఉన్న రామ్మోహన్‌నాయుడు ఆరు మాసాల క్రితం ఎయిర్‌పోర్టు పనులు పరిశీలించిన సమయంలో ప్రకటించడం గమనార్హం. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆరు మాసాల్లో ఈ పనులు 91 శాతం పూర్తయ్యాయని చెప్పుకొచ్చారు. శంకుస్థాపన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సైతం 2023 నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు పూర్తిచేసి తీరుతామని ప్రటించడం జరిగింది. ఎయిర్‌పోర్టు నిర్మాణ బాధ్యతలు చేపట్టిన జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు సైతం శంకుస్థాపన కార్యక్రమంలో ఎయిర్‌పోర్టు రావడానికి నాటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కృషి ఎంతో ఉందని, అనుకున్న సమయానికే నిర్మాణం పూర్తి చేసి తీరుతామని ప్రకటించారు. ఇవన్నీ ఆన్ రికార్డ్‌గా ఉన్నప్పటికీ కూటమి మంత్రులు మాత్రం భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదాని గూగుల్‌సెంటర్, విశాఖలో జరిగిన ఇండస్ట్రియల్ సమ్మిట్‌లు, బల్క్‌డ్రగ్‌పార్క్, మిట్టల్ స్టీల్‌ప్లాంట్ పనుల గురించి కూడా తమదే ఘనత అంటూ చెప్పుకోవడం గమనార్హం. మిట్టల్ స్టీల్‌పాంట్ ప్రతిపాదన కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే వచ్చింది. ఏడు ఇతర రాష్ట్రాలతో పోటీ పడి బల్క్‌డ్రగ్ పార్క్‌ను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సాధించింది. రెండువేల ఎకరాల భూకేటాయింపులు కూడా అప్పుడే జరిగాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కొత్త కంపెనీల కోసం తట్టమట్టి కూడా వేయపోయినప్పటికీ గత ప్రభుత్వలోనే మంజూరైన కంపెనీలను, అభివృద్ధి పనులను తమ ఖాతాలో వేసుకుంటూ ప్రారంభోత్సవాలు చేసుకోవడం కూటమి నేతలకే చెల్లిందంటూ పలువురు విమర్శిస్తున్నారు.
గతంలో మంజూరైన భవనాలకు
ప్రారంభోత్సవాలు
నియోజకవర్గ పర్యటనలో భాగంగా గత ప్రభుత్వంలో మంజూరై రూ.3.50 కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తయిన నక్కపల్లి కేజీబీవీ టైప్4 బాలికల వసతి గృహాన్ని, ఉపమాకలో రూ.40 లక్షలతో గత ప్రభుత్వం నిర్మించిన సచివాలయాన్ని మంత్రులు ప్రారంభించారు. రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూ రు చేశారు. కార్యక్రమంలో జిల్లా టీడీపీ ఽఅధ్యక్షుడు తాతయ్యబాబు, ప్రధాన కార్యదర్శి కాశీనాయడు, నియోజకవర్గ ఇన్‌చార్జ్ వెంకటేష్, ఆర్‌డీవో రమణ, మార్కెట్‌కమిటీ చైర్మన్ సత్యనారాయణ డీఈవో అప్పారావునాయుడు పాల్గొన్నారు.
ప్రచారం మాది!


