శిథిల పాఠశాల భవనాన్ని కూల్చివేయాలి
చీడికాడ: శిథిలమై ప్రమాదకరంగా ఉన్న మండలంలోని నీలంపేట పాఠశాల భవనాన్ని వెంటనే కూల్చివేయాలని మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు కోరారు. మంగళవారం నీలంపేట వెళ్లిన ఆయనకు సర్పంచ్ కసిరెడ్డి సూర్యనారాయణ, గ్రామస్తులు శిథిలమైన పాఠశాల భవనం గురించి వివరించారు. దీంతో ఆయన ఆ భవనాన్ని పరిశీలించారు.అనంతరం ఎంపీడీవో హేమసుందరరావుతో ఫోన్‌లో మాట్లాడారు.ఈ భవనంలో చిన్న పిల్లలు ఆటలాడుతుంటారని ఎటువంటి ప్రమాదం జరగకముందే దానికి కూల్చివేయాలని సూచించారు. దీనికి స్పందించిన ఎంపీడీవో పరిశీలించి, భవనాన్ని తొలగిస్తామని చెప్పినట్లు బూడి తెలిపారు.
ఎంపీడీవోకు సూచించిన
మాజీ డిప్యూటీ సీఎం బూడి
శిథిల పాఠశాల భవనాన్ని కూల్చివేయాలి


