వైఎస్సార్‌సీపీ కమిటీలపై ప్రత్యేక దృష్టి
● జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్
కశింకోట: వైఎస్సార్‌సీపీ కమిటీల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ సూచించారు. మండలంలోని తేగాడ ఎస్‌ఆర్ గార్డెన్‌లో జిల్లాలోని పార్టీ ముఖ్య నాయకులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పార్టీ కమిటీలు, అనుబంధ విభాగాల కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. వీటిని ఫిబ్రవరి 15లోగా పూర్తి చేయాలన్నారు. ఉగాదికి పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోతో కూడిన గుర్తింపు కార్డులను వారికి అందజేయనున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు ఐక్యతతో ముందుకు సాగితే పార్టీ మరింత బలోపేతం కాగలదని చెప్పారు. నర్సీపట్నం నియోజకవర్గ కమిటీ నిర్మాణం పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ చేసినందుకు అక్కడి పార్టీ సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్‌కు అభినందనలు తెలిపారు. వైఎస్సార్‌సీపీ జోన్–1 కోఆర్డినేటర్, పరిశీలకుడు హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మాజీ ఎంపీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి, ప్రభుత్వ మాజీ విప్ కరణం ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్యేలు కంబాల జోగులు, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్,అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకురాలు శోభా హైమావతి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, పార్టీ మండల అధ్యక్షుడు మలసాల కిషోర్ , రాష్ట్ర, జిల్లా నాయకులు, అధ్యక్షులు, మండలఅధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ కమిటీలపై ప్రత్యేక దృష్టి


