హంస వాహనంపై శ్రీనివాసుడు
తిరువీధి సేవలు నిర్వహిస్తున్న అర్చకులు
నక్కపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాకలో ధనుర్మాస అధ్యయనోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారికి హంస వాహనంపై తిరువీధి సేవలు నిర్వహించారు. అంతకు ముందుకు స్వామివారి మూలవిరాట్‌కు నిత్యార్చనలు అభి షేకాలు జరిపారు. అనంతర ఉత్సవ మూర్తులకు, క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి, గోదాదేవి అమ్మవార్లకు నిత్యపూజలు, విష్వక్సేనపూజ చేశా రు. హంస వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారిని, పల్లకిలో గోదాదేవి అ మ్మవారిని ఉంచి తిరువీధి సేవలు నిర్వహించారు.


