గురువారం శ్రీ 8 శ్రీ జనవరి శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

గురువారం శ్రీ 8 శ్రీ జనవరి శ్రీ 2026

Jan 8 2026 6:57 AM | Updated on Jan 8 2026 6:57 AM

గురువ

గురువారం శ్రీ 8 శ్రీ జనవరి శ్రీ 2026

గురువారం శ్రీ 8 శ్రీ జనవరి శ్రీ 2026

న్యూస్‌రీల్‌

నవ్వి పోదురుగాక..

క్రెడిట్‌ చోరీలో చంద్రబాబును అనుసరిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు

గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని..తామే చేశామంటూ ప్రచారం

వైఎస్‌ జగన్‌ హయాంలో 90శాతం పూర్తయిన అభివృద్ధి పనులు

తామే చేసినట్లుగా ప్రారంభిస్తున్న మంత్రులు, కూటమి నేతలు

అనకాపల్లిలో రూ.30.35 కోట్లతో క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రి నిర్మాణం

యథా బాబు..

తథా తమ్ముళ్లు

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అనుబంధ విభాగం కమిటీలో

పలువురికి చోటు

అనకాపల్లి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగం కమిటీలో జిల్లాకు చెందిన పలువురికి చోటు కల్పించారు. ఈ మేరకు బుధవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర లీగల్‌ సెల్‌ సహాయ కార్యదర్శిగా గొర్లె రాజేష్‌(పెందురి), రాష్ట్ర పబ్లిసిటీ వింగ్‌ కార్యదర్శిగా ఎం.శ్రీను(అనకాపల్లి), రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శిగా వి.కృష్ణచైతన్య(అనకాపల్లి), రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా కలగ గున్నయ్యనాయుడు(కశింకోట), రాష్ట్ర ఎస్సీ సెల్‌ కార్యదర్శిగా దండ జ్ఞానదీప్‌ (అనకాపల్లి)ను నియమించారు. వారితో పాటుగా అనకాపల్లి పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలుగా కాండ్రేగుల హైమావతిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

టీడీపీ ప్రభుత్వంలో క్రెడిట్‌ చోరీ సంస్కృతిని చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు అనుసరిస్తున్నారు. సొమ్ము ఒకరిది, సోకు మరొకరిది అన్నట్టుగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులన్నీ తామే చేసినట్టు గొప్పలు చెప్పుకొంటూ క్రెడిట్‌ చోరీకి పాల్పడుతున్నారు. తాము చేసిన అభివృద్ధి ఇది అని చెప్పుకోడానికి ఒక్కటి కూడా లేకపోవడంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులను తమ ఖాతాలో నిస్సిగ్గుగా వేసుకుని ప్రారంభోత్సవాలు చేస్తున్నారు.

సాక్షి, అనకాపల్లి: జిల్లాలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో సగానికి పైగా గత ప్రభుత్వంలో పూర్తవగా, మిగిలినవి 90 శాతం పూర్తి చేశారు.అయితే గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో జిల్లాలో ప్రజలకు అందించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పేర్లను మార్చి తమ ఖాతాలో వేసుకున్న కూటమి నాయకులు క్రెడిట్‌ చోరీకి పాల్పడుతున్నారు. వారి ప్రచారయావ పరాకాష్టకు చేరడంతో జిల్లా ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రం అనకాపల్లిలో ఎన్టీఆర్‌ ఆస్పత్రి ఎదుట రూ.30.35 కోట్లతో నిర్మించిన క్రిటికల్‌ కేర్‌ నుంచి అన్ని అభివృద్ధి పనుల్లో క్రెడిట్‌ చోరీకి చంద్రబాబు ప్రభుత్వం పాల్పడుతోంది. నాడు వైఎస్‌ జగన్‌ భూమి పూజ చేసిన అదాని గూగుల్‌సెంటర్‌, నక్కపల్లి బల్క్‌ డ్రగ్‌పార్క్‌ తమ హయాంలోనే వచ్చినట్లు గొప్పలు చెప్పుకుంటూ మళ్లీ చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాదిన్నర పూర్తయింది. అధికారంలో చేపట్టిన తరువాత కనీసం ఒక్క ఇటుక కూడా వేయకుండానే..గత ప్రభుత్వంలో మంజూరైన వాటికి ప్రారం భోత్సవాలు చేస్తున్నారు. అంతేకాకుండా అనకాపల్లి జిల్లాలో గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో రూ.2.3 కోట్లతో చేపట్టిన ఆర్‌డీవో కార్యాలయం, 2.5 కోట్లతో నిర్మాణం చేపట్టిన వీఎంఆర్‌డీఏ పార్కు అభివృద్ధి, నక్కపల్లిలో రూ.3.5 కోట్లతో ఏర్పాటు చేసిన బాలికల వసతి గృహం, ఉపమాకలో రూ.40 లక్షలతో గత ప్రభుత్వం నిర్మించిన సచివాలయాన్ని, రూ.90 లక్షలతో నిర్మాణం చేపట్టిన జిల్లా డిజిటల్‌ గ్రంథాలయం, రూ.6.25 కోట్లతో నిర్మాణం చేపట్టిన సామాజిక భవనాల క్రెడిట్‌ను కూటమి మంత్రులు చోరీ చేసి, ప్రారంభోత్సవాలు చేసి తమ హయాంలోనే నిర్మాణాలు చేశామంటూ ప్రచారం చేసుకుంటున్నారు.

కార్పొరేట్‌కు దీటుగా క్రిటికల్‌ కేర్‌..

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి, విషమ పరిస్థితుల్లో ఉన్న పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలను అందించేలా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో రూ.30.35 కోట్లతో అత్యాధునిక క్రిటికల్‌ కేర్‌ను ఏర్పాటు చేశారు. ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా ఎన్టీఆర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలందాలనే ముందుచూపుతో నాటి అనకాపల్లి ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి చొరవతో ప్రధానమంత్రి ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మిషన్‌న్‌(పీఎం–ఏబీహెచ్‌ఐఎం)కింద క్రిటికల్‌ కేర్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సీఎస్సార్‌ నిధులు, ఎంపీ నిధులతో ట్రామాకేర్‌, డయాలసిస్‌ బ్లాక్‌, డాక్టర్స్‌ డైనింగ్‌ హాళ్లు (మేల్‌, ఫీమేల్‌), ఎంసీహెచ్‌(2 బెడ్స్‌), ఎల్‌డీఆర్‌, ఆల్ట్రా సౌండ్‌ రూం, ప్లాస్టర్‌ రూం, పీఎంసీ ల్యాబ్‌, ఎలక్ట్రికల్‌ రూం, డ్యూటీ డాక్టర్‌ ఎగ్జామినేషన్‌ రూం, ఎమర్జెన్సీ వార్డు, నర్సస్‌ రూం, ఇంజక్షన్‌ డ్రెస్సింగ్‌ రూం, ఫస్ట్‌ ప్లోర్‌లో ఐఎస్‌వో రూం, డైనింగ్‌ హాల్స్‌–2, ఐఎస్‌వో వార్డు, అత్యాధునిక ఐసీయూ, స్టాఫ్‌ రూం..సెకండ్‌ ఫ్లోర్‌లో హెచ్‌డీయూ, అనస్తీషియా రూం, ఐసీయూ, ఓపీను ఏర్పాటు చేశారు. వైఎస్సార్‌ సీపీ హయాంలోనే మూడోంతులు నిర్మాణం పూర్తయింది. మరో వారం రోజుల్లో క్రిటికల్‌ కేర్‌ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. దీనిని కూడా చంద్రబాబు సర్కార్‌ తన ఖాతాలో వేసుకునేందుకు యత్నాలు చేస్తోంది.

రూ.6.25 కోట్లతో సామాజిక భవనాలు

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి నిధులు, సీఎస్సార్‌ నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. వీటిలో సగానికి పైగా, మరికొన్ని 90 శాతానికిపైగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పూర్తయ్యాయి. వాటిని కూడా చంద్రబాబు ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటోంది.

● అనకాపల్లి మండలం కొత్తూరు పంచాయతీలో పూడిమడక రోడ్డు వద్ద కోల్‌ ఇండియా నిధులు రూ. 89.9 లక్షలతో జిల్లా గ్రంథాలయం, డిజిటల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. పీఎంఎఫ్‌ఎం నిధులు రూ.3.7 కోట్లతో ఆర్‌ఏఆర్‌ఎస్‌లో ఇంక్యుబేషన్‌ సెంటర్‌ను, వల్లూరులో రూ.70 లక్షలతో సావిత్రీబాయి పూలే మహిళా సాధికార భవనం, రూ.70 లక్షలతో డాక్టర్‌ వైఎస్సార్‌ మహిళా క్రీడాకారుల వసతి ప్రాంగణం, తుమ్మపాల విద్యుత్‌ నగర్‌లో రూ.30 లక్షలతో ముదిరాజుల జిల్లా భవనం, గాంధీనగర్‌లో రూ.20 లక్షలతో బీసీ హాస్టల్‌ రీడింగ్‌ రూం, రూ.20 లక్షలతో ఎస్సీ హాస్టల్‌ రీడింగ్‌ రూం, శంకరం గ్రామంలో రూ.1.50 కోట్లతో 500 సిటింగ్‌ కెపాసిటీతో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ భవనం ఏర్పాటు చేశారు.

● చోడవరం నియోజకవర్గంలో వెంకన్నపాలెంలో రూ.20 లక్షలతో వాయిద్య కళాకారుల జిల్లా భవనం, మాడుగుల నియోజకవర్గంలో రూ.30 లక్షలతో మోదమాంబ సామాజిక భవనం, మాడుగుల పట్టణ ంలో రూ.5 లక్షలతో ఆరు సామాజిక భవనాలు, కశింకోట గ్రామంలో ఎస్సీ కాలనీలో రూ.50 లక్షలతో అంబేడ్కర్‌ సామాజిక భవన నిర్మాణాలు చేపట్టారు.

● పాయకరావుపేట నియోజకవర్గంలోని పాయకరావుపేట మండలం పెంటకోట వద్ద రూ.20 లక్షలతో సామాజిక భవనం, యలమంచిలి పట్టణంలో రూ.20 లక్షలతో సామాజిక భవనం, నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలంలో కోడూరులో రూ.30 లక్షలతో సామాజిక భవనం, నర్సీపట్నం టౌన్‌లో రూ.20 లక్షలతో సామాజిక భవనం ఏర్పాటు చేశారు. మొత్తం అన్నీ పూర్తయ్యాయి. అయితే వీటిని కూటమి నాయకులు తమఖాతాలో వేసుకోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

గత ప్రభుత్వంలో చేసిన వాటిలో కొన్ని అభివృద్ధి పనులు

నక్కపల్లిలో రూ.3.5 కోట్లతో బాలికల వసతి గృహం

రూ.5 కోట్లతో ఆర్డీవో కార్యాలయం, వీఎంఆర్‌డీఏ పార్కు అభివృద్ధి

రూ.90 లక్షలతో జిల్లా డిజిటల్‌ గ్రంథాలయం,

రూ.6.25 కోట్లతో సామాజిక భవనాలు

వీటితో పాటు సచివాలయ భవనాలు, ఆర్బీకేలు ఇలా ఎన్నో...

గురువారం శ్రీ 8 శ్రీ జనవరి శ్రీ 20261
1/1

గురువారం శ్రీ 8 శ్రీ జనవరి శ్రీ 2026

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement