200 కిలోల గంజాయి స్వాధీనం
అనకాపల్లి: మాడుగుల మండలం ఎం.కొడూరులో 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్టు డీఎస్పీ శ్రావణి తెలిపారు. ఆమె అనకాపల్లి కార్యాలయంలో బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.10 లక్షలు ఉంటుందని చెప్పారు. వి.మాడుగుల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎస్‌ఐ నారాయణరావు వాహనాలు మంగళవారం తనిఖీ చేస్తున్న సమయంలో గంజాయి బయటపడినట్టు చెప్పారు. వ్యాన్, ద్విచక్రవానాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి విజయవాడకు తీసుకుని వెళుతున్నట్లు గుర్తించామని, అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు పంచాయతీ వంట్లమామిడి గ్రామానికి చెందిన కొర్ర కొండబాబు, హుకుంపేట మండలం గుడా గ్రామానికి చెందిన కొమ్మ సతీష్‌కుమార్, అదేమండలం డప్పబంద గ్రామానికి చెందిన కొర్ర అనిల్ కుమార్‌ను అరెస్టు చేసినట్టు చెప్పారు. కృష్ణాజిల్లా గన్నవరం గ్రామా నికి చెందిన తడిశెట్టి దుర్గారావు పరారైనట్టు తెలిపారు. నిందితులను రిమాండ్‌కు పంపినట్టు ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో మాడుగుల సీఐ పి.పైడపునాయుడు తదితరులు పాల్గొన్నారు.


