పారదర్శకంగా భూముల రీ సర్వే
జిల్లా డిప్యూటీ సర్వే ఆఫ్ ఇన్‌స్పెక్టర్ వెంకన్న
దేవరాపల్లి: గ్రామాల్లో భూ రీ సర్వే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతోందని జిల్లా డిప్యూటీ సర్వే ఆఫ్ ఇన్‌స్పెక్టర్ ఎం.వెంకన్న తెలిపారు. మండలంలోని ముషిడిపల్లి, శంభువానిపాలెం గ్రామాల్లో జరుగుతున్న రీసర్వేను ఆయన మంగళవారం పర్యవేక్షించారు. సర్వే జరుగుతున్న గ్రామాల్లో రైతులు తమ భూముల వివరాలను తెలియజేసి సర్వే సిబ్బందికి సహకరించాలని సూచించారు. సర్వే జరుగుతున్న గ్రామాల వివరాలను దండోరా, వాట్సాప్ గ్రూపుల ద్వారా ముందుగా తెలియజేస్తున్నట్టు చెప్పారు. సర్వే జరుగుతున్న ప్రాంతాల్లో తుప్పలు, డొంకలు తొలగించాలని, తద్వారా భూమి కొలతలు చేయడం సలువుగా ఉంటుందన్నారు. ఆయన వెంట మండల సర్వేయర్ జగదీష్, గ్రామ సర్వేయర్లు కేశవ, నవీన్, మణిబాబు, జానకి, మురళీ, ప్రవీణ్, కాసుబాబు తదితరులున్నారు.


