పునరావాసం.. పరిహాసం
నక్కపల్లి: ఏపీఐఐసీ నిర్వాసితుల కోసం ప్రభుత్వం పెదబోదిగల్లం వద్ద ఏర్పాటు చేసిన పునరావాస కాలనీలో మౌలిక సదుపాయాల పనులు నత్తనడకన జరుగుతున్నాయి. దీంతో ఇక్కడకు వచ్చి ఇళ్లు నిర్మించుకునేందుకు నిర్వాసితులు ఆసక్తిచూపడం లేదు. ఫలితంగా కాలనీలో పది మంది కూడా ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు. ఆ పనులు కూడా పూర్తి స్థాయిలో జరగలేదు. వివరాల్లోకి వెళ్తే మండలంలో చందనాడ, అమలాపురం, రాజయ్యపేట, బోయపాడు,మూలపర, వేంపాడు,డీఎల్‌పురం, బుచ్చిరాజుపేట, తమ్మయ్యపేట తదితర గ్రామాల పరిధిలో ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా 4,500 ఎకరాలు సేకరించింది. వీటిలో 2,000 ఎకరాలు బల్క్‌డ్రగ్‌పార్క్‌కోసం, 2,200 ఎకరాలను ఆర్సిలర్ మిట్టల్‌స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించింది. దీంతో పై గ్రామాల్లో కొంతభాగాన్ని ఖాళీ చేయించాల్సి వస్తోంది. ఇలా నివాస ప్రాంతాలు కోల్పోతున్న సుమారు 734 మందిని గుర్తించారు. వీరందరికీ ఆర్ అండ్ ఆర్‌ప్యాకేజీ వర్తింపజేయాలి. ఐదు సెంట్ల చొప్పున ఇంటిస్థలం మంజూరు చేయడంతో పాటు, ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం చెల్లించాలి. వీరి కోసం నక్కపల్లి పక్కన ఉన్న పెదబోదిగల్లంలో సుమారు170 ఎకరాల భూమిని కొనుగోలుచేసి, పునరావాస కాలనీ నిర్మిస్తున్నారు. ఏపీఐఐసీ వారే లేఅవుట్ ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలైన రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, వాడుకనీరు, విద్యుత్, ఇంటింటికి కుళాయిలు, పాఠశాల, సామాజిక భవనాలు వంటి సదుపాయాలు కల్పించాల్సి ఉంది. ఈ 170 ఎకరాల్లో లేఅవుట్ వేసి ప్లాట్లుగా విభజించి నిర్వాసితులకు పంపిణీ చేశారు. అయితే లేఅవుట్‌లో మౌలిక సదుపాయలకల్పించే పనులు దాదాపు 6 నెలలనుంచి చేపట్టారు.. ఇవన్నీ నత్తనడకన జరుగుతున్నాయి. నష్టపరిహారం, ఆర్‌అండ్‌ఆర్‌ప్యాకేజీ ఇంటిస్థలం కేటాయించడంతో నిర్వాసితులు పునరావాస కాలనీకి వెళ్లిపోవాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. అయితే పునరావాస కాలనీలో పనులు మాత్రం చురుగ్గా జరగడంలేదు. సీసీరోడ్లు, సీసీ డ్రైనేజీలు,ఓవర్‌హెడ్‌ట్యాంకులు, బోర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. నాలుగైదు సీసీరోడ్లు మాత్రమే పూర్తిచేశారు. పనులన్నీ పూర్తికావాలంటే మరో ఆరు నెలల పైనే పట్టే పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే బోర్లు నిర్మించారు. తాగునీటిని ఉద్దండపురం వద్ద ఉన్న వాటర్‌గ్రిడ్‌నుంచి తీసుకు వస్తామని అధికారులు చెబుతున్నారు. సుమారు 15 కిలోమీటర్ల మేర పైనులైను వేసి తాగునీటిని ఈ పునరావాస కాలనీకి తరలించాల్సి ఉంటుంది. దీనికి నేషనల్ హైవే అధికారుల అనుమతులు పొందాల్సి ఉంటుంది. పదేళ్లక్రితం ప్రారంభమైన వాటర్‌గ్రిడ్ ఇప్పటి వరకు పూర్తికాలేదు.అక్కడనుంచి నీటిని ఎలా తరలిస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇన్ని సమస్యలు ఉన్న పునరావాలకాలనీలో ఇళ్లు నిర్మించుకుని తాము ఎలా నివసించగలమన్న సందేహాలు నిర్వాసితుల్లో తలెత్తుతున్నాయి. దీంతోఅక్కడకు వెళ్లి ఇళ్లు నిర్మించుకునేందకు వారు ఆసక్తి చూపడం లేదు. ఇళ్లకు సంబంధించి ప్లాట్లు కేటాయించి మూడు నెలలు గడుస్తున్నా ఎవరూ అక్కడకు వెళ్లి ఇంటిని నిర్మించుకునేందుకు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కొంతమంది టీడీపీ నాయకులు నిర్వాసితుల్లో తమ పార్టీ సానుభూతి పరులపై ఒత్తిడి తెచ్చి పునరావాస కాలనీలో ఇంటి నిర్మాణాలను ప్రారంభించారు. మొత్తం 734 మందిలో పట్టుమని పదిమందికూడా ఇళ్లనిర్మాణాలు ప్రారంభించకపోవడం గమనార్హం. వాటిలో మూడు శ్లాబ్‌లెవెల్‌లోను, మిగిలినవి పునాదుల్లోను ఉండటం విశేషం. ఆర్‌అండ్ ఆర్ ప్యాకేజీ సమస్యలు పూర్తిగా పరిష్కరించలేదని, కాలనీలో ఎటువంటి సదుపాయాలు లేవని, కేవలం రోడ్లు డ్రైనేజీపనులే ప్రారంభమయ్యాయని, ఈ నేపథ్యంలో పునరావాస కాలనీ ఇళ్లు ఎలా నిర్మించకుంటామంటూ నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు.సామాజిక అవసరాలకోసం అన్ని సదుపాయాలు కల్పించడంకుండా కాలనీలోకి వెళ్లేందుకు నిర్వాసితులు నిరాకరిస్తున్నారు. ఉన్న పళంగా తమ ప్రాంతాలను ఖాళీ చేసి వెళ్లిపోతే అక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుందని వారు చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ ఏమూలా సరిపోదని అప్పుచేసి ఇళ్లు నిర్మించుకునేందుకు సమయంపడుతుందని బాధితులు చెబుతున్నారు. 734 కుటుంబాలకు అవసరమైన విద్య,వైద్య, తాగునీరు సదుపాయాలు కల్పించిన తర్వాత వెళతామంటున్నారు. ఆర్‌అండ్ ఆర్‌ప్యాకేజీ కింద రూ.25లక్షలు, వివాహమైన ఆడపిల్లలకు కూడా ఆర్‌అండ్ ఆర్‌ప్యాకేజీ, ఇంటి స్థలం ఇస్తే తప్ప ఇళ్లను ఖాళీ చేయమని నిర్వాసితులు చెబుతున్నారు. సోమవారం మండల పర్యటనకు వచ్చిన రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్, హోమ్‌మంత్రిఅనితను కలిసి తమ నిరసన తెలియజేశారు. ఆర్ అండ్ ఆర్‌ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తే తప్ప ఇక్కడనుంచికదిలేది లేదని నిర్వాసితులు చెబుతున్నారు.
సమస్యలు పరిష్కరించాలి
పునరావాసకాలనీకివెళ్లాంటే ఆర్‌అండ్ ఆర్ ప్యాకేజీ సమస్యలు పూర్తిగా పరిష్కరించాలి.అలాగే కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. వి ద్యా, వైద్య సదుపాయాలుకల్పిస్తే తప్ప అక్కడకు వెళ్లే ప్రసక్తి లేదు. రోడ్లు,డ్రైనేజీల పనులు ప్రారంభ దశలోనే ఉన్నాయి. తాగునీరు, వాడుక నీటిసదుపాయాలు కల్పించాలి.
– తళ్ల భార్గవ్, చందనాడ
నష్టపరిహారం ఇవ్వకుండా ఖాళీ చేయం
మాభూమితోపాటు ఇంటిని తీసేసేకున్నారు.నష్టపరిహారం ఇవ్వలేదు. ఖాళీ జాగాలో పశువులకోసం, పండించిన ఉత్పత్తులు నిల్వచేసుకునేందుకు షెడ్లు వేసుకున్నాం. వాటికి నష్టపరిహారం ఇవ్వలేదు. ఇళ్లను ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. నష్టపరిహారం ఇవ్వకుండా ఖాళీ చేయబోం
– గెడ్డమూరి గోవిందు, చందనాడ
కాలనీలో మౌలిక
సదుపాయాల కల్పనలో తీవ్ర జాప్యం
ఇళ్ల నిర్మాణాలకు ఆసక్తిచూపని
లబ్ధిదారులు
పది మంది మాత్రమే ముందుకొచ్చిన వైనం
పునరావాసం.. పరిహాసం
పునరావాసం.. పరిహాసం
పునరావాసం.. పరిహాసం


