మరింత చేరువగాఆర్టీసీ డోర్ డెలివరీ సేవలు
నర్సీపట్నం: ఆర్టీసీ పార్శిల్ డోర్ డెలివరీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని జిల్లా ప్రజా రవాణాధికారి డి.ప్రవీణ సిబ్బందికి సూచించారు. డోర్ డెలివరీ మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆమె నర్సీపట్నం డిపోలోని పార్శిల్ సర్వీసు కార్యాలయాన్ని సందర్శించారు. డోర్ డెలివరీ సేవలపై డీఎం ధీరజ్‌ను ఆరా తీశారు. ఈ సందర్భంగా సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. డోర్ డెలివరీ సౌకర్యాన్ని ఆర్టీసీ 84 పట్టణల్లో అందిస్తుందన్నారు. ఒక కేజీ నుంచి 50 కేజీల వరకు డోర్ డెలివరీ చేస్తామన్నారు. అతి తక్కువ చార్జీలతో అతి వేగంగా భద్రంగా డోర్ డెలివరీ చేయటం ఆర్టీసీ వల్ల సాధ్యమన్నారు. డోర్ డెలివరీ సేవలను మరింత ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ మెకానిక్ ఇంజినీర్ ఎ.గంగాధర్, అసోసియేషన్ ప్రతినిధులు ఉన్నారు.


