బాక్సింగ్‌లో బంగారు పతకాలు
వెంకటేశ్వరరావు చేతుల మీదగా మెడల్ అందుకుంటున్న మౌనిక
నర్సీపట్నం : రాష్ట్ర స్థాయి 9వ మహిళా బాక్సింగ్ పోటీల్లో నర్సీపట్నంకు చెందిన బాక్సర్లు ఐదు పతకాలు సాధించారని శాప్ కోచ్ అబ్బు తెలిపారు. ఈ నెల 20,21 తేదీల్లో కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగిన స్టేట్ ఉమెన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న బొంతు మౌనిక 75 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. 81 కిలోల విభాగంలో ఏడిద లక్ష్మి, 54 కిలోల విభాగంలో రాజ రాజేశ్వరి, 52 కిలోల విభాగంలో జి.సాయి, 70 కిలోల విభాగంలో వై.హాసిని కాంస్య పతకాలు సాధించారు. ద్రోణాచార్య అవార్డు, ఏపీ బాక్సింగ్ ప్రెసిడెంట్ ఐ.వెంకటేశ్వరరావు చేతుల మీదుగా మెడల్స్ అందుకున్నారు.


