అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
మునగపాక : అప్పుల భారం భరించలేక మండలంలోని చూచుకొండ గ్రామంలో గడ్డిమందు తాగిన వ్యక్తి సోమవారం మృతి చెందాడని ఎస్‌ఐ పి.ప్రసాదరావు తెలిపారు. వివరాలను ఆయన విలేకరులకు తెలిపారు. చూచుకొండ గ్రామానికి చెందిన పెంటకోట వెంకట స్వామినాయుడు(49) గతంలో బ్రాండిక్స్‌లో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబ పోషణ సాగించేవాడు. ఆర్థిక సమస్యలతో అప్పులు చేసి అవి తీర్చే మార్గం లేక ఆదివారం గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతనిని అనకాపల్లి వందపడకల ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతుడు వెంకటస్వామి నాయుడుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచిన వెంకట స్వామి నాయుడు మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. కాగా సోమవారం వెంకటస్వామి నాయుడు మృతదేహానికి పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు.


