చలిమంట కాస్తుండగా నిప్పంటుకుని వృద్ధురాలికి గాయాలు
రావికమతం: అప్పలపాలెం గ్రామంలో చలిమంట కాస్తుండగా ప్రమాదవశాస్తూ చీరకు నిప్పంటుకొని వృద్ధురాలు గాయపడిన సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలివి. మండలంలో మేడివాడ పంచాయతీ శివారు అప్పలమ్మపాలెం గ్రామానికి చెందిన పాచిల చిలుకమ్మ(60) చలికి మంట కాస్తుండగా ప్రమాదవశాత్తూ చీరకు నిప్పంటుకుంది. దీంతో ఆమెకు తీవ్రగాయాలు కావడంతో స్థానికుల సహాయంతో మనవడు రావికమతం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో 108 వాహనంతో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరిలించి చికిత్స అందజేస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించాలని వైద్యులు సూచించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.


