ఎస్పీ కార్యాలయానికి 36 అర్జీలు
అర్జీదారుల సమస్యను విని సంబంధిత అధికారితో ఫోన్‌లో మాట్లాడుతున్న ఎస్పీ
అనకాపల్లి : ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్‌కు 36 ఆర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకుని అక్కడ నుంచి సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. చట్టపరిధిలో ఉన్న సమస్యలను వారం రోజుల్లో పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేయడం జరుగుతుందన్నారు. భూ తగాదాలు – 25, మోసపూరిత వ్యవహారాలు – 1, ఇతర విభాగాలకు చెందినవి –10 అర్జీలు వచ్చినట్టు తెలిపారు. ఫిర్యాదులను చట్టబద్ధంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.దేవ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.


