యూటీఎఫ్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
అనకాపల్లి: ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) జిల్లా అధ్యక్షులుగా వత్సవాయి శ్రీలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో సోమవారం జరిగిన ఎన్నికల్లో జిల్లా ప్రధాన కార్యదర్శిగా గొంది చినబ్బాయ్, గౌరవాధ్యక్షునిగా పంపనబోయిన వెంకట్రావు, సహాధ్యక్షులుగా రొంగలి అక్కునాయుడు, రొంగలి ఉమాదేవి, కోశాధికారిగా జోగా రాజేష్, కార్యదర్శులుగా పొలిమేర చంద్రరావు, గుత్తుల సూర్యప్రకాశరావు, వైరాల రమేష్‌రావు, ఉప్పాడ రాము, పట్టా శ్రీరామచంద్రమూర్తి, జాలాది శాంతకుమారి, మురహరి సంతోష్, గేదెల శాంతి దేవి, చైతన్య, ఆడిట్ కమిటీ కన్వీనర్‌గా బయలుపూడి దేముడునాయుడు, సభ్యులుగా షేక్ సలీం, కాట్రపల్లి సత్తిబాబు, రొట్టెల లక్ష్మణరాజు, అనిమిరెడ్డి సాంబమూర్తి ఎన్నికయ్యారు. ఈ కమిటీ రెండు సంవత్సరాలు పదవిలో ఉంటుందని ఎన్నికల అధికారిగా వ్యవహరించిన యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సుర్ల మురళీమోహన్ చెప్పారు. నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ విద్యారంగ పరిరక్షణే ధ్యేయంగా ఉపాధ్యాయుల సంక్షేమం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు.


