9వ అదనపు జిల్లా కోర్టు ఏపీపీగా సూర్యనారాయణ
సూర్యనారాయణను అభినందిస్తున్న ఎమ్మెల్యే రాజు, న్యాయవాదులు
చోడవరం: స్థానిక 9వ అదనపు జిల్లా కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సీనియర్ న్యాయవాధి చీపురుపల్లి సూర్యనారాయణ నియమితులయ్యారు. ఆయనను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సూర్యనారాయణ చోడవరం బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. సీనియర్ న్యాయవాదిగా పేరున్న ఆయన ఏపీపీగా నియమితులవ్వడంపై బార్ అసోసియేషన్‌తో పాటు అంతా అభినందనలు తెలిపారు. ఆయనను ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్ రాజు, గోవాడ సుగర్స్ మాజీ చైర్మన్ గూనూరు మల్లునాయుడు, మాజీ ఎంపీపీ గూనూరు పెదబాబు, మాజీ జెడ్పీటీసీ కనిశెట్టి మచ్చిరాజు, గవర కార్పొరేషన్ డైరక్టర్ బొడ్డేడ గంగాధర్ అభినందించారు.


