అభివృద్ధి పనులకు శంకుస్థాపన
అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో చిన్నారికి పోలియో చుక్కలు వేస్తున్న కలెక్టర్ విజయ కృష్ణన్
అనకాపల్లి టౌన్: స్ధానిక ఎన్టీఆర్ ఆస్పత్రిలో మాగ్నేసియా కంపెనీ సీఎస్సార్ నిధులతో పలు కార్యక్రమం నిర్వహించారు. రూ.1.80 లక్షలతో నిర్మించే డి–అడిక్షన్ సెంటర్, పేషెంట్స్ వెయిటింగ్ హాల్, నూతన మార్చురీ భవన పనులకు ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ శంకుస్థాపన చేశారు. ఎంపీ సి.ఎం.రమేష్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పాల్గొన్నారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో చిన్నారులకు కలెక్టర్ పోలియో చుక్కలు వేశారు. పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఎంపీ లాడ్స్ నిధులతో పట్టణంలోని కీలక ప్రాంతాలలో ఏర్పాటు చేసిన 80 సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్, మహిళా భద్రత కోసం ప్రత్యేకంగా కేటాయించిన స్కార్పియో వాహనం, నాగార్జున సిమెంట్స్ వారు అందజేసిన 55 స్టాపర్ బోర్డులను ప్రారంభించారు. ఎస్పీ తుహిన్ సిన్హా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.


