సహకార ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
డీసీసీబీ చైర్మన్ తాతారావు
చోడవరం : సహకార సంఘాల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు పేర్కొన్నారు. సహకార సంఘాల ఉద్యోగులు యూనియన్ మహాజన సభ ఆదివారం వెంకన్నపాలెంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో నెంబరు 36 అమలుతో పాటు సహకార ఉద్యోగులకు ఆరోగ్య బీమా మూడు లక్షల రూపాయల పెంపుదలతో పాటు 2019 తర్వాత చేరిన ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని, పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాల అమలు గురించి, తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ లక్ష్మణరావు, ప్రధాన కార్యదర్శి జి. రమణ, ఉపాధ్యక్షుడు అప్పారావు, లోవరాజు పాల్గొన్నారు.


